
వచ్చే వారంలో బ్యాంకులు వరుసగా సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు వరుస సెలవులు ఉన్నాయి. 28 నుంచి 30 వరకు బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా వరుసగా మూడు రోజలు పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక గాంధీ జయంతి రానుండటంతో ఈ వారంలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. దీంతో ఖాతాదారులు దీనిని గమనించి ముందుగానే తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవులు గురించి ముందే తెలుసుని రోజువారీ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి. నగదు అవసరాల కోసం బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వచ్చే వారంలో బ్యాంక్ సెలవుల గురించి డీటైల్డ్‌గా చూద్దాం.
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
28 నుంచి 30 వరకు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండవు. ప్రైవేట్ బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి వస్తుంది. ఆ రోజున జాతీయ సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ మూతపడాయి. దీంతో వచ్చే వారంలో మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు ఉండవు. బ్యాంక్ ఖాతాదారులు దీనిని గమనించి ప్లాన్ చేసుకోవాలి.
ఏయే సేవలు నిలిచిపోతాయి..?
బ్యాంకులు మూతపడటం వల్లన నగదు డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్, కొత్త ఖాతాలు తెరవడం, డ్రాఫ్ట్‌లు, పాస్‌బుక్ అప్‌డేట్, లాకర్‌కు సంబంధించిన పనులు పూర్తిగా నిలిచిపోతాయి. పత్రాలను సమర్పణ లేదా ఇతర పరిపాలనా పనులు ఆగిపోతాయి.
బ్యాంక్ లావాదేవీలు ఎలా చేసుకోవాలి..?
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీంతో చెల్లింపులు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, డబ్బు బదిలీ చేయడానికి ఈ విధానాలను ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఖాతాకు సంబంధించిన నిధుల బదిలీలు, ఇతర డిజిటల్ లావాదేవీలు యధావిధిగా కొనసాగుతాయి. ఏటీఎం సేవలు కూడా పనిచేస్తూనే ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిబంధనల ప్రకారం.. ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి నిధుల బదిలీ సేవలు సంవత్సరంలో 365 రోజులు, రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు పెద్ద లావాదేవీలను వీటి ద్వారా నిర్వహించుకోవచ్చు.