Reading Time: < 1 minute
Bihar Man Kills Sister In Law Over Food Delay

బీహార్‌లో జెహానాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. భోజనం ఆలస్యంగా పెట్టిందనే కోపంతో వదిన గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. హత్య తర్వాత ఆమె తలను నరికి ఇంటికి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలు నింపింది. మృతురాలిని ఇమాద్‌పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అంశు దేవిగా గుర్తించారు. ఆమె భర్త ధర్మంద్ర కుమార్. ఈ సంఘటన పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నిందితుడు కునాల్ కుమార్ డ్రగ్స్‌కు బానిసగా మారినట్లు స్థానికులు వెల్లడించారు. ఘటన సమయంలో అంశు దేశి ఇంట్లో ఉండగా, మిగతా కుటుంబసభ్యులు పొలం పనుల కోసం వెళ్లారు. పొలం నుంచి ఇంటికి వచ్చని కునాల్ కుమార్ భోజనం పెట్టాలని కోరాడు. భోజనం వడ్డించడం ఆలస్యం కావడంతో ఆగ్రహానికి గురైన అతను గొడ్డలి తీసుకుని అంశుదేవిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది.

హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోకుండా ఇంటి సమీపంలోనే కూర్చుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.