Reading Time: < 1 minute
Prashanth Neel Shoots Ntr Dragon Massive Europe Style Action Sequence At Ramoji Film City

NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా యూరప్‌ ని తలపించే భారీ సెట్‌ను నిర్మించింది. ఈ ప్రత్యేక సెట్‌లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సినిమాకు కీలకంగా నిలిచే ఈ యాక్షన్ సన్నివేశాల కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూరప్‌లో చిత్రీకరించినట్లే కనిపించేలా సెట్ డిజైన్ చేయడం ద్వారా ప్రేక్షకులకు కొత్త విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ సినిమాలకు యాక్షన్ సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయి. అదే తరహాలో ‘డ్రాగన్’లో కూడా కళ్ళు చెదిరే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో తొలిసారి జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కుదరడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, మరోవైపు ప్రశాంత్ నీల్ స్టైలిష్ మేకింగ్ కలిసి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాయో అన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. భారీ నిర్మాణం, పవర్‌ఫుల్ యాక్షన్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ‘డ్రాగన్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత తదుపరి షూటింగ్ వివరాలను చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది.