
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) కీలక పాత్రలో నటించబోతున్నట్లు గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతోనే ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర వర్గాలు స్పష్టం చేశాయి. కత్రినా కైఫ్ ‘స్పిరిట్’లో నటించడం లేదని, ఆమె కమ్‌బ్యాక్‌పై వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తెలిపాయి.
టాలీవుడ్ రీ-ఎంట్రీపై ఆసక్తి: ఒకవేళ ఈ వార్త నిజమైతే, కత్రినా కైఫ్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఆమె చివరిసారిగా టాలీవుడ్‌లో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ (2004), బాలకృష్ణ సరసన ‘అల్లరి పిడుగు’ (2005) చిత్రాల్లో నటించారు.
అధికారిక క్లారిటీ ఏంటి?
కత్రినా కైఫ్‌ను హీరోయిన్ పాత్ర కోసం కాకుండా.. కథలో అత్యంత కీలకమైన, సినిమాకు బలమైన మలుపు తీసుకొచ్చే పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తూ వస్తుంది. ఇదే నిజమైతే ప్రభాస్, కత్రినా కైఫ్ తొలిసారి ఒకే తెరపై కనిపించనున్నారనే ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది. గతంలో టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కూడా దక్షిణాది నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కత్రినా ఎక్కువగా బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అలాంటి ఇప్పుడు ‘స్పిరిట్’ వంటి పాన్ ఇండియా సినిమాలో కనిపిస్తే అది ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
అయితే, కత్రినా కైఫ్ ‘స్పిరిట్’లో నటిస్తున్నారనే వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి లేదా నటి కత్రినా కైఫ్ తరఫు నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ప్రస్తుతం కేవలం సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం (Rumour) మాత్రమేనని స్పష్టమవుతోంది.
Katrina Kaif is reportedly joining #Spirit for a special cameo!
According to reports, she is not replacing Deepika Padukone, but will make a key special appearance in the film starring #Prabhas and Triptii Dimri.
The makers have not officially confirmed this yet. pic.twitter.com/FBe3h2WO1Y
— Anjali (@Vada_paaww) July 26, 2026
ఇక ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. 2027 మార్చి 5న ఈ సినిమా విడుదల కానుంది.
You loved what existed before.
Now fall in love with what you never knew existed….#SPIRIT FIRST POSTER 🔥#OneBadHabit #Prabhas@imvangasandeep @tripti_dimri23 pic.twitter.com/J1Svt3E8uY— Spirit (@InSpiritMode) December 31, 2025