Reading Time: < 1 minute
Dharmendra Pradhan Offered To Quit Twice Before Resignation

Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2సార్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు సార్లు రాజీనామాకు ప్రయత్నించినా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఆయన రాజీనామాను ఎన్డీయే సర్కార్ ఆమోదించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

జూలై 20న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కూడా ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు. అయితే, విద్యారంగంలో సంస్కరణలు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం ఆయనను కోరిందని సమాచారం. మంత్రి రాజీనామా చేయడం సమస్యకు సులభమైన పరిష్కారం మాత్రమే అని, బాధ్యత నుంచి తప్పుకోవడం అవతుందని మోడీ ప్రభుత్వం భావించింది.

కానీ జూలై 20 ‘‘పార్లమెంట్ మార్చ్’’ తరహాలో భారీ నిరసన, ఆందోళన చేపడుతామని సీజేపీ హెచ్చరించడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకుంది. దీంతో పాటు జూలై 20 నిరసనల్లో పలువురు విద్యార్థులు గాయపడటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. అదే సమయంలో కొందరు దేశ వ్యతిరేక శక్తులు కూడా ఈ నిరసనలను తమ ప్రయోజాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందనే ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది.

డిజిటల్ మానిటరింగ్‌లో విద్యార్థుల ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న 400కుపైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించినట్లు, వాటిలో సుమారు 100 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు పాకిస్థాన్ నుంచి నిర్వహించబడుతున్నాయని ప్రాథమిక సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న 400 మందిని గుర్తించినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాన ఆమోదించి, ఈ ఆందోళనకు పరిష్కారం దిశగా తీసుకెళ్లింది.