Reading Time: < 1 minute

కామన్వెల్త్‌లో అదరగొట్టండి.. భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ స్పెషల్ మెసేజ్!

Caption of Image.

Commonwealth Games 2026: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ప్రారంభమైన 23వ కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2026) పోటీల్లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి (అథ్లెట్లకు) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మన అథ్లెట్లు పట్టుదల, ప్యాషన్, అత్యుత్తమ క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పోటీ పడతారనే నమ్మకం తనకు ఉందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ క్రీడలు: 
గ్లాస్గో వేదికగా జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ 23వ కామన్వెల్త్ క్రీడలు ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో మొత్తం 10 రకాల క్రీడా విభాగాలలో 215 ఈవెంట్లలో పతకాల కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇండియా తరఫున అత్యుత్తమ పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

మన అథ్లెట్ల నైపుణ్యం కోట్లాది మందికి స్ఫూర్తి: ప్రధాని సందేశం
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) లో ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. కామన్వెల్త్ #Glasgow2026 క్రీడలు ప్రారంభమవుతున్న సందర్భంగా భారత బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మన క్రీడాకారులు ఎంతో పట్టుదల, క్రీడా స్ఫూర్తి,  నిబద్ధతతో పోటీల్లో రాణిస్తారనే నమ్మకం నాకు ఉంది. మన అథ్లెట్ల నైపుణ్యం, అంకితభావం ఎల్లప్పుడూ కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

ALSO READ : భారత్‌కు మరో బిగ్ షాక్.. నాడా దెబ్బకి కామన్వెల్త్ గేమ్స్‌కు స్టార్ అథ్లెట్ దూరం!

©️ VIL Media Pvt Ltd.