Reading Time: < 1 minute

పెను విషాదం.. టాటా సుమోపై విరిగి పడిన కొండ చరియలు.. 13 మంది స్పాట్ డెడ్

Caption of Image.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో, ఉదయ్‌పూర్-కిలాడ్ రహదారిపై విషాదం జరిగింది. కడు నాలా సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో.. కొండ రాళ్లు టాటా సుమో టాక్సీపై పడ్డాయి. ఈ ఘటనలో సుమో నుజ్జునుజ్జయింది. పదమూడు మంది అక్కడికక్కడే మరణించగా, స్థానికులు ఇద్దరిని రక్షించారు.

ఉన్నట్టుండి కొండచరియలు విరిగిపడ్డాయి. తేరుకునే అవకాశమే లేకుండా బాధితులు ప్రయాణిస్తున్న సుమో బండరాళ్ల కింద నలిగిపోయింది. దీంతో.. ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. గురువారం రాత్రి ఉదయ్‌పూర్-కిల్లార్ రహదారిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు టిండి గ్రామంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

రహదారిని తిరిగి రాకపోకల కోసం తెరిచిన వెంటనే, ప్రయాణికులు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. ఇంతలోనే కడు నల్లా సమీపంలో బండరాళ్ల కింద టాటా సుమో టాక్సీ నుజ్జునుజ్జు కావడంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

ALSO READ : కోర్టు వీడియోలపై సుప్రీం కీలక ఆదేశాలు.. 

ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం తక్షణమే స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా టూరిస్టులు అని పోలీసులు తెలిపారు. ఈ టూరిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.