Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?

విజయ్ దేవరకొండ, రష్మిక ముచ్చటగా మూడోసారి జతకట్టిన సినిమా ‘రణబాలి’. విజయ్ కు లాస్ట్ హిట్ ‘టాక్సీవాలా’ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఒకవైపు హిట్ పెయిర్, మరోవైపు హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్ మూవీ కాకుండా పీరియాడికల్ జానర్ తో రూపొందుతోంది.
రణబాలి షూటింగ్ మొదలైన వెంటనే సెప్టెంబర్ 11న రిలీజ్ అంటూ ప్రకటించారు నిర్మాతలు. మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. సెప్టెంబర్ 11 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమనే ఫీలింగ్ లో మేకర్స్ ఉన్నారని, త్వరలోనే మరో రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అని తెలిసింది.
రణబాలి మరో రిలీజ్ డేట్ కోసం ట్రై చేస్తుంటే స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. దసరాకు వద్దామనుకుంటే అక్టోబర్ 2న వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’, అక్టోబర్ 15న ‘జైలర్ 2’ రిలీజ్ అవుతున్నాయి. దసరా అక్టోబర్ 20న కావడంతో 16న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నారు. నవంబర్ లో ఫ్రైడే స్లాట్స్ ఖాళీగా ఉన్నా, అన్‌సీజన్ లో రావాలనుకోవడం లేదు. డిసెంబర్ 3న ఆల్రెడీ ‘ఫౌజీ’ లైన్ లో ఉంది. పోనీ క్రిస్మస్ కు వద్దామనుకుంటే NBK109 ను డిసెంబర్ 24న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. దసరాకు 18 రోజుల ముందే ఆదర్శ కుటుంబం రిలీజ్ అవుతుంది. ఈ లెక్కన దసరా రేసులో జైలర్ 2 మాత్రమే దిగుతోంది. పండక్కి మరో సినిమా రావడానికి ఛాన్స్ ఉంది. ఆ అవకాశాన్ని రణబాలి ఉపయోగించుకుంటుందేమో చూడాలి మరి.