Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ఏమైంది?.. మరీ ఇలా అయిపోయాడేంటి ! టెన్షన్లో భాయ్ ఫ్యాన్స్

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా భాయ్ జాన్ ముంబైలో స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కొత్త డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సపోర్ట్ సెంటర్‌ను ప్రారంభించడానికి సల్మాన్ హాజరయ్యారు. అయితే, అక్కడ సల్మాన్ గతంతో పోలిస్తే చాలా సన్నగా, అలసిపోయినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది. ‘సల్మాన్‌కు ఏమైంది?’, ‘ఆరోగ్యం బాగానే ఉందా?’ అంటూ అభిమానులు వరుసగా పోస్టులు చేస్తున్నారు.
టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!
స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ఈవెంట్‌లో సల్మాన్ లుక్స్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అక్కడ కొత్త డేటా కలెక్షన్ సెంటర్‌ను ఇనాగ్యురేట్ చేయడానికి వచ్చిన భాయ్‌జాన్.. చాలా లీన్‌గా, వీక్‌గా కనిపించడంతో ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ‘భాయ్‌కి ఏమైంది? చాలా సిక్‌గా కనిపిస్తున్నారు..‘ఆయన అనారోగ్యంతో ఉన్నారా?’, ‘మా కింగ్‌కు ఏమైంది?’ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
He looks tired 🚨
hope is doing well 🙏 #SalmanKhan #MaatruBhumi pic.twitter.com/MAmN0UNRlw
— Always Bollywood (@AlwaysBollywood) July 19, 2026
అయితే మరికొందరు మాత్రం వయసు పెరగడాన్ని అందరి ముందు అంగీకరించడానికి ఎంతో ధైర్యం కావాలని సల్మాన్‌ను సమర్థిస్తున్నారు. ‘ఇంత పెద్ద ఇండియన్ సూపర్‌స్టార్ అయి ఉండి కూడా.. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా తన రియల్ ఏజ్‌ను పబ్లిక్‌గా యాక్సెప్ట్ చేయడానికి చాలా గట్స్ కావాలి. లుక్స్ మారినా ఆయన క్యారెక్టర్ ఎప్పటికీ మారదు’ అంటూ భాయ్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అయితే, సల్మాన్ ఆరోగ్యంపై ఆయన లేదా భాయ్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
❤️ #Salmankhan @BeingSalmanKhan SALMAN KHAN pic.twitter.com/TkUFrdBf5f
— 👑 (@neelikhan7786) July 18, 2026
సల్మాన్ లైన్-అప్
మాతృభూమి (Maatrubhumi): ఫస్ట్ ఈ సినిమాను ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ అనుకున్నారు, కానీ ఇప్పుడు స్టోరీ & టైటిల్ మార్చేసి ఫుల్ రీ-షూట్స్ చేస్తున్నారు. అపూర్వ లఖియా డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్ సంతోష్ క్యారెక్టర్ చేస్తున్నారు. చిత్రాంగద సింగ్ ఇందులో ఫీమేల్ లీడ్.
ALSO READ : ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు.. జీ5లో ఈ 3 థ్రిల్లర్స్ నెక్స్ట్ లెవెల్..
Eid 2027 బిగ్గెస్ట్ కొల్లాబ్: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా సల్మాన్ ఖాన్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇది 2027 ఈద్ పండక్కి థియేటర్లలో రచ్చ చేయనుంది. ఇలా మరికొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. ఏదేమైనా భాయ్ హెల్త్‌పై వస్తున్న రూమర్స్ పక్కన పెడితే, నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు!