July 21, 2026

వాహనదారులకు అలర్ట్…జూలై 21న బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణం.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్...జూలై 21న బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణం.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Reading Time: < 1 minute

వాహనదారులకు అలర్ట్…జూలై 21న బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణం.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Caption of Image.

వాహనదారులకు బిగ్ అలర్ట్ .. హైదరాబాద్ సిటీలో ప్రముఖ దేవాలయం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రేపటి(జూలై20) నుంచి రెండు రోజుల పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో  రోడ్లన్నీ మూసివేస్తారు.  వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.  

జూలై21,21 తేదీల్లో రెండు రోజుల పాటు ఎల్లమ్మతల్లి  కళ్యాణమహోత్సం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అమ్మవారి కల్యాణానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. దీంతో ఆలయం పరిసర ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేసి ట్రాఫిక్ మళ్లించనున్నారు. ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటిస్తూ సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. 

ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే.. 

ఫతేనగర్ నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలను ఫతేనగర్ ఫ్లైఓవర్ దగ్గర న్యూ బ్రిడ్జ్ మీదుగా కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు.
సత్యం థియేటర్ వైపు నుంచి..బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను సత్యం థియేటర్, మైత్రీవనం మీదుగా ఎస్సార్‌ నగర్ ‘T’ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఎస్సార్‌ నగర్ నుంచి..ఫతేనగర్ వరకు ఉండే అన్ని బై-లేన్లు, లింక్ రోడ్లను మూసివేస్తారు. 

పార్కింగ్ వివరాలు:

భక్తుల కోసం R&B ఆఫీస్, GHMC గ్రౌండ్స్, నేచర్ క్యూర్ హాస్పిటల్ దగ్గర ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.

©️ VIL Media Pvt Ltd.