July 21, 2026

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య
Reading Time: < 1 minute

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

Caption of Image.

అగర్తాలా: త్రిపుర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపుర త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం (జులై 20) అగర్తలాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ (పీహెచ్‌క్యూ)లోని తన కార్యాలయంలో విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించిన సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే డీజీపీ మృతి చెందినట్లు ప్రకటించారు. 

అనురాగ్ ధన్కడ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, సీనియర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాతే ఆయన మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. త్రిపుర పోలీసులు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

ALSO READ : ప్రధాని మోదీకి లేఖ రాసినా నో రెస్పాన్స్..

అనురాగ్ ధన్కడ్ త్రిపుర కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. త్రిపుర పోలీస్ డిపార్ట్మెంట్‎లో ఆయన వివిధ విభాగాల్లో పని చేశారు. 2025, మే నెలలో త్రిపుర డీజీపీగా అనురాగ్ ధన్కడ్ బాధ్యతలు చేపట్టారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సంవత్సరానికే ఆయన ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్టేట్ పోలీస్ బాస్ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనక కారణం ఏంటనేది సస్పెన్స్‎గా మారింది. 

©️ VIL Media Pvt Ltd.