Reading Time: 2 minutes

ప్రధాని మోదీ ఇంటి దగ్గర ధర్నా కేసులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విడుదల

Caption of Image.

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి దగ్గర ధర్నా కేసులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు విడుదల చేశారు. ధర్నా చేసిన నిరసనకారులందరినీ పోలీసులు విడుదల చేశారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం పీఎస్ నుంచి రాహుల్, మందిర్ మార్గ్ పీఎస్ నుంచి ప్రియాంక విడుదలయ్యారు. ప్రియాంక గాంధీ కోసం సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు.

ఇదిలా ఉండగా.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసుల దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్ట సభల ప్రతినిధులమైన తమతోనే పోలీసులు ఇంత అణచివేత ధోరణితో వ్యవహరిస్తే.. ఇక సామాన్య నిరసనకారుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారు. ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాని మోదీ ఇంటి ముందు బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ముక్కు నుంచి రక్తం కారింది. అయినప్పటికీ పోలీసులు ఆయనను వదిలిపెట్టలేదు. బలవంతంగా కాళ్లూచేతులు పట్టుకుని వ్యాన్ ఎక్కించారు. రాహుల్ ముక్కు వెంట రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

అరెస్ట్ తర్వాత రాహుల్ గాంధీతో పాటు ధర్నాలో భాగమైన అందరినీ ఛత్రసాల్​స్టేడియంకు పోలీసులు తీసుకెళ్లారు. కనీసం డాక్టర్ను కూడా పిలవకుండా పోలీసులు చోద్యం చూశారు. రాహుల్​వ్యక్తిగత భద్రతా సిబ్బంది చికిత్స అందించడం గమనార్హం.

©️ VIL Media Pvt Ltd.