July 20, 2026

38 ఏళ్ల క్రితం ఇద్దరు శిశువులు తారుమారు.. DNA పరీక్షతో బయటపడ్డ నిజం.. అసలు విషయం తెలిసి..

38 ఏళ్ల క్రితం ఇద్దరు శిశువులు తారుమారు.. DNA పరీక్షతో బయటపడ్డ నిజం.. అసలు విషయం తెలిసి..
Reading Time: 2 minutes

38 ఏళ్ల క్రితం ఇద్దరు శిశువులు తారుమారు.. DNA పరీక్షతో బయటపడ్డ నిజం.. అసలు విషయం తెలిసి..

Caption of Image.

ఇద్దరు వ్యక్తుల జీవితంతో విధి ఆడుకున్న వింత నాటకం ఇది. దాదాపు సగం జీవితం గడిచిన తర్వాత తెలిసిన నిజం. తమకు తెలియకుండా.. తమకు ఊహ కూడా మొదలు కాని వయసులో.. ఎవరో చేసిన తప్పిదం వలన.. కన్న తల్లిదండ్రుల దగ్గర కాకుండా.. పెంపుడు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఇద్దరు వ్యక్తుల జీవిత కథ ఇది. విషయం బయట పడకుంటే.. పెంచిన వాళ్లే కన్నవాళ్లు అనుకుంటూ గడిపేవారేమో. కానీ డీఎన్ఏ పరీక్షల్లో బయటపడ్డ నిజంతో.. అర్థం కాని నిర్వేదం వాళ్ల జీవితంలో నిండిపోయింది. సినిమా స్టోరీలా అనిపించే ఈ రియల్ లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

1988లో ఉత్తర డకోటాలోని యూనిటీ మెడికల్ సెంటర్‌లో పుట్టిన ఈ ఇద్దరు శిశువులు తారుమారయ్యారు.  జెరెమీ మారిసన్, కైల్ బైలిన్ ఈ ఇద్దరు ఒకరి కుటుంబం దగ్గర ఒకరు పెరిగారు.  క్రిస్టమస్ గిఫ్ట్ గా తీసుకున్న  హోమ్ డీఎన్‌ఏ టెస్ట్ ఈ దిగ్భ్రాంతికర నిజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా ఆసుపత్రి పైన న్యాయపరమైన చర్యలకు పూనుకున్నాయి. ఈ వ్యవహారంలో సిబ్బంది నిర్లక్ష్యం లేదని, ఆ రికార్డులు కూడా లేవని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.

తను పెరిగిన కుటుంబం తన సొంతం కాదని తెలిసినప్పుడు వ్యక్తులు గందరగోళం, దుఃఖం, గుర్తింపు సంక్షోభం ఎదుర్కొంటారు. వీళ్ల విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఈ సమయంలో కుటుంబాల మద్దతు చాలా అవసరమని నిపుణుల సూచిస్తున్నారు. ఈ సంఘటన ప్రజలందరికీ చెప్పే సందేశం ఏంటంటే.. తమ జెనెటికల్ ఐడెంటిటీని ప్రతీ వ్యక్తి కలిగి ఉండాలని చెప్తోంది. 

వీళ్లు పుట్టిన సమయంలో హాస్పిటల్ వ్యవస్థ వేరేలా ఉండేది. ఆ పరిస్థితుల్లో తారుమారయ్యారు. విషయం తెలిసిన తర్వాత కన్నీరు పెట్టుకున్నారు. తమ తల్లిదండ్రులను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకు దూరమయ్యామని బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా తమ రక్త సంబంధం ఇన్నాళ్లు తమకు దూరంగా ఉండిపోయిందని బాధ వ్యక్తం చేశారు. 

అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈ విషయం తెలిసింది కదా.. ఏంటి పరిస్థితి  అని అడిగినప్పుడు.. తారుమారైన పరిస్థితులు తమ చేతుల్లో లేవు. అయినా పేగు తెంచుకు పుట్టిన బిడ్డను ఎలా పెంచుతారు అలాగే పెంచి ప్రయోజకులను చేశారు. కావున వీళ్లే మా తల్లిదండ్రులు. వాళ్లు జన్మనిస్తే.. వీళ్లు భవిష్యత్తును ఇచ్చారు. ఇద్దరూ ముఖ్యమే. కన్నవాళ్లు దొరికారని పెంచిన వాళ్లను దూరం చేసుకోం. అందరికి తల్లిదండ్రులు ఒకరే ఉంటారు . మాకు ఇద్దరిద్దరున్నందుకు మేము అదృష్టవంతులం అంటూ సమధానం చెప్పారు. 

ఇప్పుడు ఆసుపత్రుల్లో ఎలక్ట్రానిక్ రికార్డులు, బార్‌కోడ్ ఐడెంటిటీ బ్యాండ్లు, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్రాకింగ్ వంటి అధునిక వ్యవస్థలు ఉన్నాయి. దీంతో శిశువులు మార్చివేయబడే సంఘటనలు చాలా అరుదు.

ఆరోగ్యం విషయంలో జెనెటిక్ ఐడెంటిటీ ఎంత ముఖ్యం..?

ఈ ఇన్సిడెంట్ హెల్త్  కేర్ విషయంలో జన్యు గుర్తింపు (జెనెటిక్ ఐడెంటిటీ) ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.  ఒక వ్యక్తి కుటుంబ మెడికల్ హిస్టరీ ఆధారంగా హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వారసత్వ వ్యాధులను ముందస్తుగా గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ సరిగ్గా లేకుంటే ఆ అవసరమైన పరీక్షలు చేసుకునే వీలుండకపోవడం వల్ల కొన్ని సార్లు ప్రమాదకర పరిస్థితులు ఎదురు కావచ్చని వైద్యులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.