లార్డ్స్ వన్డేలో రోహిత్ హిస్టారికల్ సెంచరీ.. విమర్శలకు బ్యాట్తో సమాధానం.. వరల్డ్ కప్ రేస్లో ఉన్నానంటూ సందేశం

ఫామ్ కోల్పోయాడు.. వయసు సహకరించట్లేదు.. వరల్డ్ కప్ కు అవసరం లేదు.. ఇవి ఇన్నాళ్లు హిట్ మ్యాన్ పై వస్తున్న విమర్శలు. ఎవరెన్ని మాట్లాడినా కుంగిపోకుండా.. తన రోజు కోసం ఎదురు చూస్తూ వస్తున్న రోహిత్ శర్మ.. విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. లార్డ్స్ స్టేడియంలో ఏ ఒక్క ఇండియా బ్యాటర్లకు సాధ్యం రికార్డును సాధించి చరిత్ర సృష్టించాడు. గెలవాల్సిన మ్యాచ్ లో 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అద్భుత సెంచరీ ఇచ్చి మ్యాచ్ పై ఆశలు సజీంగా ఉంచాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న డిసైడింగ్ మ్యాచ్.. 3వ వండేలో రోహిత్ శర్మ అద్భుత సెంచరీ సాధించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఇది రోహిత్ ఇంటర్నేషనల్ కెరీర్‌లో మరో మైలురాయి. లార్డ్స్ వేదికపై మొదటి సెంచరీ కావడం విశేషం. రోహిత్ కేవలం 84 బంతుల్లోనే (11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేశాడు. లార్డ్స్ స్టేడియంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా తొలి వికెట్‌గా శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ మంచి పాట్నర్షిప్ అందిచాడు. ఆ తర్వాత రోహిత్ తన స్ట్రోక్ ప్లేతో ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు. స్టైలిష్ బ్యాటింగ్‌తో ఫోర్లు, సిక్సర్లు చూసి ప్రేక్షకులు ఉర్రూతలూగారు.
ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ కావచ్చని ముందు వార్తలు వచ్చాయి. బీసీసీఐ సెలెక్టర్లు 2027 వరల్డ్ కప్ ముందు కొత్త జట్టును కోసం కసరత్తు చేస్తున్న సమయంలో.. సెంచరీతో రోహిత్ తన ఫామ్‌ను మరోసారి నిరూపించాడు.