July 21, 2026

Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన

Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
Reading Time: < 1 minute
Congress Protest Outside Pm Modi Residence Delhi Rahul Gandhi Kharge Detained

దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ కార్యకర్తలు, సీజేపీ నిరసనకారులు పాల్గొన్నారు. గూండాగిరి, నిరంకుశత్వం నశించాలంటూ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసనలు తెలిపారు. ప్రధాని మోడీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు మోడీ నివాసం ఎదుట నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు-నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగారు.