July 21, 2026

2010 సెంటిమెంట్ రిపీట్.. 2027లో టీమిండియాదే ప్రపంచకప్.. ఫిఫా విజేతతో తేలిన ఫ్యూచర్ రిజల్ట్..!

2010 సెంటిమెంట్ రిపీట్.. 2027లో టీమిండియాదే ప్రపంచకప్.. ఫిఫా విజేతతో తేలిన ఫ్యూచర్ రిజల్ట్..!
Reading Time: 2 minutes
2010 సెంటిమెంట్ రిపీట్.. 2027లో టీమిండియాదే ప్రపంచకప్.. ఫిఫా విజేతతో తేలిన ఫ్యూచర్ రిజల్ట్..!

2027 World Cup India Prediction: క్రీడా ప్రపంచంలో కొన్ని అరుదైన సెంటిమెంట్లు, లెక్కలు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. తాజాగా 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను స్పెయిన్ జట్టు కైవసం చేసుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన పోలిక విపరీతంగా వైరల్ అవుతోంది. 2010-2011 నాటి మ్యాజిక్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ కాబోతోందా అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాలలో జోరుగా చర్చించుకుంటున్నారు.

2010 సెంటిమెంట్ రికార్డులు ఇవే..!

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర కథనం ప్రకారం.. గతంలో 2010లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2011లో జరిగిన క్రికెట్ ప్రపంచకప్‌ను మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, అదే 2011 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.

ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

ఈ మూడింటి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ క్రీడాభిమానులు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ముడిపెడుతున్నారు.

2026లో స్పెయిన్ విశ్వరూపం.. సెంటిమెంట్ మళ్లీ మొదలు..!

తాజాగా జూలై 19న న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ పోరులో అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. సరిగ్గా 2010 నాటి దృశ్యమే 2026లోనూ పునరావృతం కావడంతో క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

స్పెయిన్ విజయం సాధించిన వెంటనే, సామాజిక మాధ్యమాల్లో ఒక మీమ్, పోస్టర్ దావానలంలా వ్యాపించింది. 2010లో స్పెయిన్ గెలిచింది కాబట్టి, 2026లోనూ స్పెయిన్ గెలిచింది. మరి అదే సెంటిమెంట్ ప్రకారం 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంటుందా? అలాగే 2027లో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా? అంటూ నెటిజన్లు ఆసక్తికరమైన ప్రశ్నలతో విశ్లేషణలు మొదలుపెట్టారు.

నెటిజన్ల హల్‌చల్.. ఆశల్లో టీమిండియా అభిమానులు..!

ఈ వైరల్ మీమ్ చూసిన క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంఖ్యలు, సంవత్సరాలు కుదిరిన తీరు చూస్తుంటే 2027లో భారత క్రికెట్ జట్టు మళ్లీ ప్రపంచకప్‌ను ముద్దాడటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో గణాంకాలు, సెంటిమెంట్లు కేవలం కాకతాళీయమే అయినప్పటికీ, గతంలో జరిగిన అద్భుతాలు మళ్లీ పునరావృతం కాకూడదని ఏమీ లేదని పోస్టులు పెడుతున్నారు.

ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!

మరీ ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ మద్దతుదారులు ఈ సెంటిమెంట్ లెక్కలపై తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. 2011 నాటి విజయాల పరంపర 2027లోనూ నిజమైతే అంతకంటే కావాల్సిందేముంది అని భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..