July 21, 2026

Vastu tips : ఈశాన్యంలో బరువులు ఉంటే కలిగే నష్టం ఇదే.. రెండు ద్వారాలు పెట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Vastu tips :  ఈశాన్యంలో బరువులు ఉంటే కలిగే నష్టం ఇదే.. రెండు ద్వారాలు పెట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
Reading Time: < 1 minute

Vastu tips : ఈశాన్యంలో బరువులు ఉంటే కలిగే నష్టం ఇదే.. రెండు ద్వారాలు పెట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Caption of Image.

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..  ఇంటి ఈశాన్యంలో బరువు ఉంటే ఎలాంటి నష్టం వస్తుంది. అలాగే రెండు ద్వారాలు పెట్టాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు …మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం…

ప్రశ్న: మా ఇంటికి ఈశాన్య దిక్కులో చిన్న గుట్టలాగా ఎత్తులో రాళ్లు, మట్టిదిబ్బలు ఉన్నాయి. ఇలా ఉండడం వాస్తుపరంగా ఏమైనా దోషమా?

జవాబు: ఈశాన్యం దిక్కు ఈశ్వరుడి స్థానం. అందువల్ల ఈశాన్యంలో బరువు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది. వాస్తు ప్రకారం ఈశాన్యం (తూర్పు-ఉత్తరం)లో బరువు ఉంటే అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇంటికి ఎంత దూరంలో రాళ్లు, దిబ్బలు ఉన్నాయనే దాన్నిబట్టి ఆ ప్రభావం ఉంటుందని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు చెబుతున్నారు.

ప్రశ్న:ఇంటికి రెండు ద్వారాలు పెట్టాలనుకుంటున్నాం. ఎలా ఉండాలి? ఏ వైపు ఏ ద్వారం (సింహద్వారం) ఉండాలి?

జవాబు:ఇంటికి నాలుగు దిక్కులా ఏమేం ఉన్నాయి. రోడ్ ఫేసింగ్​ ను బట్టి ద్వారాల విషయంలో
నిర్ణయం తీసుకోవాలి. తూర్పు ఈశాన్యం. ఉత్తర ఈశాన్యంలో ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. దక్షిణంవైపు ఫేసింగ్ ఉంటే, దక్షిణ సెంటర్లో ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరం, తూర్పు వైపు కూడా మంచిదేనని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు అంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.