July 20, 2026

చెట్టెక్కిన కారు.. దుబాయ్ వెళ్తున్న ఫ్రెండ్ను సాగనంపేందుకు వెళ్తూ ORR పై ఘోర ప్రమాదం.. ..

చెట్టెక్కిన కారు.. దుబాయ్ వెళ్తున్న ఫ్రెండ్ను సాగనంపేందుకు వెళ్తూ ORR పై ఘోర ప్రమాదం.. ..
Reading Time: < 1 minute

చెట్టెక్కిన కారు.. దుబాయ్ వెళ్తున్న ఫ్రెండ్ను సాగనంపేందుకు వెళ్తూ ORR పై ఘోర ప్రమాదం.. ..

Caption of Image.

దుబాయ్ పయనం అయిన స్నేహితుడిని సాగనంపేందుకు వెళ్తున్న స్నేహితుల కారు బోల్తా కొట్టడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ORR డివైడర్ ను ఢీకొట్టిన కారు.. రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి వెళ్లి ఏకంగా చెట్టుపై ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ORR పై ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్‌గా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డుపక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో   ఖాజా అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జమీర్, యాకూబ్, అక్బర్ తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు, పోలీసులు గాయపడ్డవారిని వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి  కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.