July 21, 2026

Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?

Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
Reading Time: 2 minutes
Silk Smitha Suicide Note Emotional Letter Goes Viral

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో పుట్టిన విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చి సిల్క్ స్మిత అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా తమిళనాడులో అయితే ఆమెపై అభిమానానికి హద్దులు ఉండేవి కావు. తెలుగు, తమిళ భాషల్లో అయితే విడుదల కాకుండా ఆగిపోయిన కొన్ని సినిమాలు కూడా ఆమెతో ప్రత్యేకంగా ఒక పాట చిత్రీకరించి జోడించిన తర్వాత బిజినెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఆమె పాటల కోసమే థియేటర్స్ కి వచ్చే జనాలు గట్టిగా ఉండేవారు.  ఆమె పాటల వల్ల హిట్ అయిన సినిమాలూ చాలానే ఉండేవి. కానీ వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా 1996లో ఆమె జీవితం విషాదాంతమైంది. అయితే ఆమె చనిపోయే ముందు రాసుకున్న సూసైడ్ నోట్ అప్పట్లో పత్రికల్లో కూడా అచ్చయింది. ఒక సోషల్ మీడియా యూజర్ దానిని పోస్ట్ చేయడంతో ఇప్పుడు మరోసారి వైరల్ అయింది. 

లెటర్ యధాతధంగా …. 

“అభాగ్యురాలు 22/9/1996 

దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నా వారు అంటూ ఎవరూ లేరు.  నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నా మీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమ లేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నా చుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్న . అతను నన్ను మోసం చేసారు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజూ టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేశాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును. అంటూ ఆమె తన ఆవేదన అంతా ఒక లేఖలో రాసి బలవన్మరణానికి పాల్పడింది.