Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్!

Sandeep Reddy: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. డార్లింగ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమా షూటింగ్ పురోగతిపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “స్పిరిట్’ షూటింగ్‌లో ఇప్పటికే 40 శాతం పూర్తైంది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అంటూ వెల్లడించారు.
ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’లో ప్రభాస్ ఇప్పటివరకు చేయని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఇంటెన్స్ టేకింగ్, భావోద్వేగాలతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన తాజా అప్డేట్‌తో ‘స్పిరిట్’పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తవడంతో త్వరలో మరిన్ని అధికారిక అప్డేట్స్ వచ్చే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. మార్చి 5, 2027లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.