Jr NTR: ‘త్వరగా కోలుకోండి బాల బాబాయ్’.. బాలయ్య ఆరోగ్యంపై ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.!

నందమూరి నటసింహిం బాలకృష్ణ వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన నటిస్తున్న #NBK111 మూవీ షూటింగ్ లో ప్రమాదం చోటు చేసింది. కాకినాడ పోర్ట్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా.. సోమవారం ఉదయం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో బాలకృష్ణకు స్వల్ప గాయం అయింది. ప్రమాదాన్ని గమనించిన చిత్రబృందం వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది
ఓ రిస్కీ స్టంట్ చేస్తున్న సమయంలో ఆయన కండరాలకు (మసిల్ టియర్) గాయమైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. వైద్యుల పరీక్షల అనంతరం ఇది తీవ్రమైన గాయం కాదని, అయితే పూర్తిగా కోలుకునేందుకు చిన్న శస్త్రచికిత్స (మైనర్ సర్జరీ) చేయించుకోవాలని సూచించినట్లు తెలిపింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
వైద్యుల సలహా మేరకు బాలకృష్ణ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుండగా, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే #NBK111 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే బాలయ్య అంకితభావం యూనిట్ సభ్యులకు స్ఫూర్తిదాయకమని నిర్మాతలు పేర్కొన్నారు. బాలకృష్ణకు గాయమైన వార్త తెలిసిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. #GetWellSoonBalayya అంటూ పోస్ట్ చేస్తూ తమ ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు ఫ్యాన్స్..
During the filming of an intense action sequence for #NBK111 in Kakinada, Nandamuri Balakrishna Garu sustained a minor muscle tear.
As advised by the medical team, he will undergo a minor surgical procedure to ensure a swift and complete recovery.
His unwavering dedication,…
— NBK 111 (@NBK111Movie) July 21, 2026
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎక్స్ (X) వేదికగా.. ‘త్వరగా కోలుకోండి బాల బాబాయ్. మీరు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి మళ్లీ అదే జోష్‌తో గర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ-ఎన్టీఆర్ సంబంధాలపై వినిపించిన పలు ఊహాగానాల మధ్య తారక్ చేసిన ఈ ఆప్యాయ పోస్ట్ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆయన కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడతారని చిత్ర యూనిట్ వెల్లడించింది.
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…
— Jr NTR (@tarak9999) July 21, 2026