July 20, 2026

జనగామ కలెక్టరేట్లో భారీ ఫ్రాడ్.. కంప్యూటర్లు, దిక్సూచి పేరుతో రూ. కోటి నొక్కేసిన.. ముగ్గురు అధికారులు సస్పెండ్

జనగామ కలెక్టరేట్లో భారీ ఫ్రాడ్.. కంప్యూటర్లు, దిక్సూచి పేరుతో రూ. కోటి నొక్కేసిన.. ముగ్గురు అధికారులు సస్పెండ్
Reading Time: < 1 minute

జనగామ కలెక్టరేట్లో భారీ ఫ్రాడ్.. కంప్యూటర్లు, దిక్సూచి పేరుతో రూ. కోటి నొక్కేసిన.. ముగ్గురు అధికారులు సస్పెండ్

Caption of Image.

జనగామ కలెక్టరేట్ లో భారీ ఫ్రాడ్ వెలుగు చూసింది. కలెక్టరేట్ నిధుల్లో దాదాపు కోటి రూపాయలు మాయం కావడం సంచలనంగా మారింది.  కంప్యూటర్ల కొనుగోలు పేరుతో భారీ స్కాంకు పాల్పడిన  ముగ్గురు అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కంప్యూటర్ల పేరిట నకిలీ బిల్లులతో 2026  ఫిబ్రవరిలో ఒకే రోజున సొమ్ము బదిలీ చేసినట్టు అంతర్గత తనిఖీల్లో వెల్లడయింది. కంప్యూటర్ల పేరున బిల్లు చేసినప్పటికీ.. భౌతిక తనిఖీలో ఒక్క వస్తువు కూడా లభించలేదని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.

ఈ ఘటనపై ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులను సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. జనగామ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.387/2026 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహాలో దిక్సూచి పుస్తకాల పేరిట రూ.46.50 లక్షలు దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తో్ంది. మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగంపై లోతైన దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.