July 21, 2026

Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే

Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
Reading Time: < 1 minute
Nandamuri Balakrishna Injured On Nbk111 Sets Minor Surgery Advised

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుండెలాగిపోయే వార్త. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 షూటింగ్‌ ప్రాంగణంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బాలయ్యకు స్వల్ప గాయమైనట్లు చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో వేగంగా శరవేగంగా జరుగుతోంది. అక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి చిన్నగా ‘మసిల్ టియర్’ అయింది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యులు, ఆయన వేగంగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరమని సూచించినట్లు దర్శకుడు తెలిపారు.

ఈ ఘటనపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు: “సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.”  అన్నారు.  గతంలో బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి . ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సైతం మాస్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్ పైకి రావాలని నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.