స్కూల్లో డ్రగ్స్ ఏంట్రా…? బోయిన్ పల్లి మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేంద్రం గుట్టురట్టు…

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, ఈగల్ టీం కృషి చేస్తున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ దందా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని బోయిన్ పల్లిలోని మేధా స్కూల్లో మరోసారి డ్రగ్స్ కేంద్రం గుట్టురట్టయ్యింది. ఆదివారం ( జులై 19 ) బోయిన్ పల్లి మేధా స్కూల్ లోని ఆల్ప్రాజోలామ్ తయారీ యూనిట్‌పై ఈగల్ అధికారుల దాడులు నిర్వహించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
పక్కా సమాచారంతో డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడి చేసిన అధికారులు 3.5 కిలోల ఆల్ప్రాజోలామ్, 4.3 కిలోల సెమీ ఫినిష్డ్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా రూ.21 లక్షల నగదు, భారీగా ముడి పదార్థాలు, యంత్రాలు సీజ్ చేశారు అధికారులు. స్కూల్ వెనుక భాగంలో రహస్యంగా డ్రగ్ తయారీ చేస్తున్న నిర్వాహకుడు జయప్రకాశ్ గౌడ్ ను అరెస్ట్ చేశారు అధికారులు.
ALSO READ : నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు..
గతంలో కూడా అరెస్టైన ప్రకాష్ గౌడ్
డ్రగ్స్ కేసులో గతంలో కూడా అరెస్ట్ అయ్యాడు ప్రకాష్ గౌడ్. మహబూబ్‌నగర్, బూత్‌పూర్ పరిసర కల్లు డిపోలకు డ్రగ్ సరఫరా చేసినట్లు గుర్తించారు అధికారులు. ఆల్ప్రాజోలామ్ తయారీ ఫార్ములా అందించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు అధికారులు. ఈ ముఠాలో ఉన్న నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు.