మెగాఫోన్ పట్టిన మాస్ హీరోలు.. డైరెక్షన్‌లోనూ కమర్షియల్ ఫార్ములాపైనే నమ్మకం!

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా ఇప్పుడు యంగ్ హీరోలంతా వరసగా మెగాఫోన్ పట్టి ట్రెండ్ సృష్టిస్తున్నారు. యాక్టింగ్‌తోనే కాకుండా డైరెక్షన్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్స్ కొట్టాలని కసితో ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడే అందరూ ఒకే దారిని ఎంచుకున్నారు. రామ్ పోతినేని నుంచి విశాల్ వరకు కెమెరా వెనుక ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దామా..? రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూట్ వేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్‌గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ కథతో మెగాఫోన్ పట్టారు రామ్. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా ఫన్ కమర్షియల్ ఎంటర్టైనర్‌తో దర్శకుడిగా మారుతున్నారు. ఇప్పటికే ఫలక్‌నుమా దాస్, ధమ్కీ లాంటి కమర్షియల్ సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన విశ్వక్ సేన్.. మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారు. ఈసారి ఏకంగా కల్ట్ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో కమర్షియల్ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన యాటిట్యూడ్‌కు సరిపోయే కథతోనే వస్తున్నారు విశ్వక్ సేన్. ఈ చిత్ర టీజర్‌కు రెస్పాన్స్ బాగానే వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళనాట డైరెక్షన్ బాట పడుతున్నారు హీరోలు. విశాల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న మకుటం కూడా ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ సినిమానే. ఈ సినిమాను దివంగత నిర్మాత ఆర్‌బీ చౌదరి తన సూపర్ గుడ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఇలా సౌత్‌లో యంగ్ హీరోలంతా మెగాఫోన్ పడుతున్నది కమర్షియల్ కథలతోనే..! మరి వాళ్లను అవి ఆదుకుంటాయా లేదా అనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: