Sravana Masam 2026: శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
వృషభం: ఈ రాశికి గురు, శుక్ర, బుధుల అనుకూలత బాగా పెరుగుతున్నందువల్ల రాబోయే శ్రావణ మాసంలో ఈ రాశివారు ఎక్కువగా శుభ కార్యాలు చేయడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రేమలు, పెళ్లిళ్లు, ఆస్తి క్రయ విక్రయాలు, సొంత ఇల్లు వంటివి అనుకూలంగా ఉంటాయి. కుటుం బంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ ఉద్యోగాలు, సంతానం, పెళ్లి, ప్రేమలు, ఆర్థిక విషయాల్లో సక్సెస్ అవుతారు.
మిథునం: ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో రాశ్యధిపతి బుధుడు సంచారం చేయడం వల్ల ఈ రాశివారు వచ్చే శ్రావణ మాసం వెళ్లే లోగా మహా అదృష్టవంతులవుతారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా సఫలమవుతాయి.
కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, బుధ, శుక్రులు అనుకూలంగా ఉన్నందువల్ల శ్రావణ మాసమంతా వైభవంగా సాగిపోతుంది. పెళ్లి, ఉద్యోగం, గృహ సంబంధమైన విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది. అధికార యోగం పడుతుంది.
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు గురువు సంచారం వల్ల ఈ రాశివారు శ్రావ ణంలో శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న పెళ్లిళ్లు, గృహ ప్రవే శాల వంటివి వైభవంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారమై ఆస్తి చేతికి వస్తుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు బాగా చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు, దశమ, లాభ స్థానాల్లో బుధ, శుక్రుల సంచారం వల్ల శ్రావణ మాసంలో ఈ రాశివారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి, గృహ ప్రవేశం, ఆస్తుల కొనుగోలు, వాహన యోగం వంటి ముఖ్యమైన సంఘటనలు సంభవిస్తాయి. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆదాయంబాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మకరం: ఈ రాశికి సప్తమంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారి జీవితం, జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు పూర్తవుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేపట్టినా సఫలమవుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి వృద్ది చెందుతాయి.





