తెలంగాణలో మళ్ళీ SIR గడువు పొడిగింపు ఉండదు.. ఎన్యుమరేషన్ ఫామ్లు తొందరగా BLOలకు ఇవ్వండి

హైదరాబాద్: తెలంగాణలో మళ్ళీ SIR గడువు పొడిగింపు ఉండదని, ఎన్యుమరేషన్ ఫామ్లు తొందరగా BLOలకు ఇవ్వండని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్ ఫామ్లు తొందరగా BLOలకు ఇవ్వండని ఆయన ఓటర్లకు సూచించారు. ఫామ్ తీసుకున్న ఓటర్లు ఆగస్టు 3 వరకు ఉందని చెబుతున్నారని, కానీ ఈ ఫామ్లు అన్నీ డిజిటలైజేషన్ చేయాలని.. అందువల్ల తొందరగా ఫామ్లు ఇవ్వండని ఆర్వీ కర్ణన్ కీలక సూచన చేశారు.
చివరి రోజు వరకూ ఆగితే.. డిజిటలైజేషన్ చేసే సమయంలో సర్వర్ డౌన్ కూడా అవ్వొచ్చని ఆయన చెప్పారు. మళ్ళీ SIR ఎక్స్టెన్షన్ ఉండదని, BLOలు కొన్ని చోట్ల ఐదారు సార్లు ఇంటింటికి వెళ్ళారని గుర్తుచేశారు. హైదరాబాద్ జిల్లాలో 9.59 శాతం ఓటర్లు ఆన్ లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేశారని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 43 శాతం ఎన్యుమరేషన్ ఫామ్లు రిసీవ్ చేసుకుని.. వివరాలు డిజిటలైజ్ చేశామని RV కర్ణన్ వివరించారు.
ఓటరును భయపెట్టి, ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటు హక్కుకు, వెల్ఫేర్ స్కీమ్కి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. మీ ఓటు హైదరాబాద్లో ఉన్నా లేక గ్రామాల్లో ఉన్నా వెల్ఫేర్ స్కీమ్స్ ఏం పోవని చెప్పారు.
SIR ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన ఒక AEROను సస్పెండ్ చేశామని, కొంతమంది BLOలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. బీఎల్వోలు ఎలా పని చేస్తున్నారో చెక్ చేయడానికి విజిలెన్స్ అధికారులు ఫీల్డ్లో చెక్ చేస్తున్నారని చెప్పారు.