July 19, 2026

Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?

Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
Reading Time: 2 minutes
National Award Winning Yami Gautam Film Streaming On Article 370 Netflix

Article 370: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిలో మరోసారి పడింది ‘ఆర్టికల్ 370’ మూవీ. రిలీజ్ టైమ్ లోనే చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గుర్తింపు దక్కించుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. యామీ గౌతమ్ కెరీర్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న సినిమాగా నిలిచిన ఈ చిత్రం, ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమాను ఇంకా చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వెతకడం ప్రారంభించారు. జూలై 18న ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చలనచిత్ర అవార్డును కైవసం చేసుకుంది. అదే సమయంలో ఈ చిత్రంలో ఎన్ఐఏ అధికారి జూనీ హక్సర్ పాత్రలో అద్భుత నటన కనబరిచిన యామీ గౌతమ్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఒకే మూవీకి ఉత్తమ సినిమా, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు రావడం సినిమాకు మరింత ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ ఏడాది అవార్డుల్లో కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డును పంచుకోగా, ‘ఆర్టికల్ 370’ ప్రధాన విజేతగా నిలిచింది.

ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. దేశ భద్రత, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతిశయోక్తులకు తావులేకుండా, సంఘటనలను సూటిగా చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. యామీ గౌతమ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. థియేటర్లలో సుమారు 50 రోజుల విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం 2024 ఏప్రిల్ 19న డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉంది. విడుదలైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యూస్ సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ మంచి ఆదరణ పొందింది.

జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత ‘ఆర్టికల్ 370’ బాక్సాఫీస్ ఫలితాలపై కూడా మళ్లీ చర్చ మొదలైంది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.82.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి కమర్షియల్ హిట్ మూవీగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ వసూళ్లు సాధించడంతో పాటు జాతీయ అవార్డులు కూడా అందుకోవడం ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. జాతీయ అవార్డులతో మరోసారి చర్చల్లోకి వచ్చిన ‘ఆర్టికల్ 370’ను ఇంకా చూడని వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. రాజకీయ నేపథ్యంతో సాగే స్ట్రాంగ్ కంటెంట్, యామీ గౌతమ్ పవర్‌ఫుల్ నటన, రియల్ స్టోరీ కారణంగా ఈ చిత్రం ఇప్పటికీ చూడదగ్గ సినిమాల జాబితాలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.