July 21, 2026

ఢిల్లీలో హైటెన్షన్..రాహుల్ గాంధీ అరెస్ట్ ..బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు

ఢిల్లీలో హైటెన్షన్..రాహుల్ గాంధీ  అరెస్ట్ ..బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు
Reading Time: 2 minutes

ఢిల్లీలో హైటెన్షన్..రాహుల్ గాంధీ అరెస్ట్ ..బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించిన పోలీసులు

Caption of Image.

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్​ వాతావరణం నెలకొంది. నీట్ పేపర్​ లీకులకు బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయాలని, నిన్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడులకు నిరసనగా ఢిల్లీలోని ప్రధాని నివాసం దగ్గర ధర్నాకు దిగిన కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్​ తోపాటు ప్రియాంకగాంధీ, ఖర్గే, సమాజ్​ వాదీ పార్టీ నేత అఖిలేస్​ యాదవ్​ఇతర  కాంగ్రెస్​ నేతలను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు. అరెస్ట్​ సమయంలో కాంగ్రెస్​ నేతలకు , పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్​ ను బలవంతంగా పోలీసులు వ్యాన్​ ఎత్తుకెళ్లి వ్యాన్​ఎక్కించారు. దీంతో 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాని ఇంటిదగ్గర ఉద్రిక్తత నెలకొంది. 
 
దేశ రాజధాని ఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధాని ఇంటిదగ్గర ఉద్రిక్తత మంగళవారం హై టెన్షన్ ఉద్రిక్తత నెలకొంది.  కాక్రోచ్ పార్టీ నిరసనల క్రమంలో నిరసనకారులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ.. నీట్​ పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ  ధర్మేంద్ర  ప్రధాన్​, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని   లోక్​ కళ్యాణ్ మార్గ్​ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు. ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి యత్నించారు. మూడు గంటలుగా  మోదీ ఇంటిముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్.. ఇతర కాంగ్రెస్ ప్రముఖులు నిరసన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్’ యాంటీ యూత్’ పీఎం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు.

©️ VIL Media Pvt Ltd.