July 20, 2026

Video: పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. అనంతపురంలో ఆసక్తికర ఘటన

Video: పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. అనంతపురంలో ఆసక్తికర ఘటన
Reading Time: < 1 minute
Video: పీఠాధిపతికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. అనంతపురంలో ఆసక్తికర ఘటన

మనకు నచ్చిన వారు ఆత్మీయులు దూరం అయితే వచ్చే బాధను తీర్చడం ఎవరి తరం కాదు. మనుషులు తమ బాధను శోకతప్త హృదయాలతో రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు జంతువులు కూడా తమకు నచ్చిన వారు, యజమానులు దూరమైతే పడే బాధను విచిత్రంగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. అచ్చు అలాంటి ఘటనే అనంతపురం జిల్లా ఉరవకొండ గవి మఠంలో చోటు చేసుకుంది.

గవి మఠం పీఠాధిపతి శివైక్యం చెంది ఇక తన ముందు కనిపించడు అన్న విషయం గుర్తించి గవి మఠం ఆస్థాన ఏనుగు గజలక్ష్మి చిత్రంగా తన బాధను వ్యక్తం చేసింది. స్వామి అంతిమ యాత్రలో పూల మాల సమర్పించి తల ఆడిస్తూ బాధని వ్యక్తం చేసింది. కన్నీరు పెడుతూ, తొండం నేలకు ఆనించి సంతాపం తెలిపింది. 20సంవత్సరాలుగా గవి మఠంలో ఆస్థాన ఏనుగుగా సేవలందించి గజలక్ష్మి యజమాని పట్ల తనకున్న అనుబంధాన్ని ఇలా వ్యక్తం చేస్తోందని భక్తులు కన్నీరు పెట్టుకున్నారు.

వీడియో చూడండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి