Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!

Ketan Agarwal Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు సమాచారం ప్రకారం, ముందుగా కేతన్‌ను సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు హత్య చేయాలని భావించలేదని, ప్రమాదంలా కనినించే ఘటనలో కేతన్‌కు శాశ్వత అంగవైకల్యానికి గురిచేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. దీని తర్వాత హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జూన్ 6న జరగాల్సిన బాలి పర్యటన, వివాహాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా కేతన్ చేయి లేదా కాలుకు తీవ్ర గాయాలయ్యేలా నకిలీ రోడ్డు ప్రమాదం లేదా దోపిడీ ఘటనకు పాల్పడాలని భావించారు. కేతన్ వికలాంగుడైతే పెళ్లి రద్దు చేసుకోవడానికి కుటుంబాన్ని ఒప్పించడం సులువు అవుతుందని సియా భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు స్లో పాయిజనింగ్‌కు కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ నేరాలను అమలు చేయడానికి లోనావాలా పరిసరాల్లో టైగర్ పాయింట్, వీసాపూర్ కోట తదితర ప్రాంతాలను సియా, చేతన్‌లు పరిశీలించారు. చివరకు లోహగఢ్ కోటను ఎంచుకున్నట్లు తెలిసింది.
పథకం ప్రకారం మే 31న కేతన్‌ను లోహగఢ్ కోటపై నుంచి తోసేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే, ఆ రోజు సియా హత్యయత్నానికి పాల్పడలేదని అధికారులు తెలిపారు. జూన్ 14న సియా, కేతన్ మరోసారి లోహగఢ్ కోటకు వెళ్లినప్పటికీ, ఆ రోజు ప్రణాళిక అమలు కాలేదు. జూన్ 14 నుంచి 18 మధ్య పుణెలోని బెవర్లీ హిల్స్ ప్రాంతంలో ఒకరిని తోసే విధానాన్ని పలుమార్లు రిహార్సల్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు.