Anshka : అందరి ముందు తన ప్రేమను బయటపెట్టాడు.. నేను సరే అన్నాను.. హీరోయిన్ అనుష్క..

టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్, ‘జెజమ్మ’ అనుష్క శెట్టి పేరు వినగానే అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు గుర్తుకువస్తాయి. నటనతోనే కాకుండా తన హుందాతనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మంగళూరు బ్యూటీ.. తాజాగా తన పాఠశాల రోజుల్లో జరిగిన మొదటి లవ్ ప్రపోజల్ తాలూకు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి విషయాలపై అభిమానుల్లో ఎప్పుడూ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో అనుష్క తన స్కూల్ రోజులను గుర్తుచేసుకుంటూ.. తనకు ఎదురైన మొదటి లవ్ ప్రపోజల్ గురించి మాట్లాడారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయి తన ముందుకు వచ్చి ఎంతో ధైర్యంగా ‘ఐ లవ్ యూ’ అని ప్రపోజ్ చేశాడని స్వీటీ చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
ఆ వయసులో అసలు ‘ఐ లవ్ యూ’ అంటే పూర్తి అర్థం ఏంటో కూడా తనకు సరిగ్గా తెలియదని అనుష్క నవ్వుతూ ఒప్పుకున్నారు. అయితే ఆ అబ్బాయి అంత ధైర్యంగా వచ్చి తన మనసులోని మాట చెప్పేసరికి.. తనేమీ పెద్దగా ఆలోచించకుండా వెంటనే ‘ఓకే’ అని సమాధానం ఇచ్చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ వయసులో ఉన్న అమాయకత్వం, అల్లరి వల్ల ఆ ప్రపోజల్‌ను చాలా లైట్‌గా తీసుకున్నానని, కానీ జీవితంలో ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ఎమోషనల్‌గా పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
యోగా టీచర్‌గా కెరీర్ ప్రారంభించి, నాగార్జున ‘సూపర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క.. ఆ తర్వాత హీరోలతో సమానమైన స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం 40 ఏళ్లు దాటినా ఆమె ఇంకా సింగిల్‌గానే ఉంటుండటంతో తరచూ ఆమె పెళ్లిపై రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొందరు బిజినెస్‌మెన్‌లతో ఆమె పెళ్లి జరగబోతోందంటూ వచ్చే వార్తలను ఆమె టీమ్ ఖండిస్తూనే ఉంది. ప్రస్తుతం అనుష్క తెలుగులో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. స్వీటీ పంచుకున్న ఈ స్కూల్ డేస్ క్రష్ స్టోరీ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‌లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..