July 21, 2026

Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్

Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
Reading Time: < 1 minute
Delayed Kollywood Movies Lock Release Dates Jana Nayagan Train More Set For Release

కోలీవుడ్‌లో కొన్ని రోజుల నుండి ల్యాబ్‌లో మగ్గిపోతున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. ఎన్నో కారణాలతో రిలీజ్‌కు నోచుకోని మూవీస్ థియేటర్స్ బాట పడుతున్నాయి. వాటిలో ముందుగా వస్తున్న చిత్రం జననాయగన్. దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జన నాయగన్  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉండగా సెన్సార్ ఇష్యూతో వాయిదాలు అవుతూ ఇప్పుడు సాల్వై జులై 23న ప్రేక్షకుల ముందకు రాబోతుంది. అలాగే విజయ్ సేతుపతి- మిస్కిన్ కాంబోలో తెరకెక్కుతోన్న ట్రైన్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం, ఆగస్టులో విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

సూరీ, నివిన్ పౌలీ, అంజలి నటించిన యుజు కాదల్ యజు మలై మూవీకి కూడా చాన్నాళ్లుగా మోక్షం దక్కడం లేదు. 2021లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీటైంది. రెండేళ్ల క్రితమే రొట్టర్ డ్యామ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు కూడా. అప్పటి నుండి ల్యాబ్‌లోనే మగ్గిపోతూనే ఉన్న ఈ మూవీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అక్టోబర్ 1న మూవీ థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. ఈ సినిమాలన్నీ వస్తున్నాయి కానీ విక్రమ్- గౌతమ్ వాసు దేవ్ మీనన్ కాంబోలో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం చిత్రం మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్, న్యాయపరమైన చిక్కులు ఇంకా వీడినట్లు లేవు. అసలు వస్తుందో రాదో కూడా డౌటే. చూడాలి ధ్రువ నక్షత్రానికి మరీ మోక్షం దక్కేదెప్పుడో.