హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు.. నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ.. ఎవరు అర్హులు..? ఎలా అప్లై చేసుకోవాలి ..పూర్తి వివరాలు

హైదరాబాద్ సిటీలో సొంతింటి కల కంటున్న పేదలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది!. ఇప్పటికే సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న సర్కార్.. ఇప్పుడు సిటీలో అసలు ఇండ్ల స్థలమే లేని నిరుపేదలకు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉచితంగా స్థలంతో పాటు, ఫ్లాట్ నిర్మించి ఇచ్చేందుకు పనులను స్పీడప్ చేసింది.
మరి ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఉండబోతున్నాయంటే.. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో ఏకంగా 5 లక్షల రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఖరీదైన ల్యాండ్ కాస్ట్‌ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది.
17 నియోజకవర్గాల్లో తొలిదశలో 7 వేల 680 ఫ్లాట్లు
1 రాజేంద్ర నగర్-మైలార్‌దేవ్‌పల్లి
2 మహేశ్వరం – జల్పల్లి
3 శేరిలింగంపల్లి – రాయదుర్గం
4 ఇబ్రహీంపట్నం- తట్టి అన్నారం, బండ్లగూడ
5 మల్కాజ్‌గిరి – కౌకూర్
6 నాంపల్లి – రెడ్ హిల్స్, నీలోఫర్ పోలీస్ క్వార్టర్స్
7 ఖైరతాబాద్- హకీంపేట్ దర్గా
8 జూబ్లీహిల్స్- ఎమ్మెల్యే కాలనీ
9 కార్వాన్ – కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్
10 బహదూర్‌పురా- నంది ముసలిగూడ
11 అంబర్‌పేట్- సిటీ పోలీస్ లైన్స్
12 కూకట్‌పల్లి – కేపీహెచ్‌బీ (KPHB) కాలనీ
13 మేడ్చల్ – పోచారం ఎల్‌ఐజీ (LIG) కాలనీ
14 కుత్బుల్లాపూర్ – గాజులరామారం
15 సనత్ నగర్ -పాటిగడ్డ
16 సికింద్రాబాద్ కంటోన్మెంట్ – మారేడ్‌పల్లి – మహేంద్రహిల్స్
17 మలక్‌పేట్- గడ్డిఅన్నారం,ఆర్ అండ్ బీ (R&B) క్వార్టర్స్
ఈ పథకానికి అర్హులు ఎవరు?
లబ్ధిదారులు కనీసం 10 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే నివసిస్తూ ఉండాలి.
కుటుంబంలో ఎవరికీ సొంత ఇల్లు కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ ఉండకూడదు.
ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు.. ఒకే ఫ్లాట్ రూల్ వర్తిస్తుంది.
అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయల లోపు ఉండాలి.
ఎలా అప్లై చేసుకోవాలి?
జూలై 21 నుంచి మీ సేవ కేంద్రాల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు.. మీ మొబైల్ నుంచే 8096958096 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సులువుగా అప్లై చేసుకోవచ్చు.