Yash: యష్ రావణుడి లుక్‌పై రచ్చ.. ‘రామాయణం’ ట్రైలర్‌కు ముందే మొదలైన భారీ చర్చ!

వరుసగా ట్రైలర్ ప్రీమియర్స్ వేస్తున్న రామాయణ టీమ్ సినిమా మీద హైప్ పెంచుతోంది. అయితే రెగ్యులర్ ఆడియన్స్ కోసం ట్రైలర్ అఫీషియల్ రిలీజ్ కాకముందే సినిమాలో లుక్స్ విషయంలో డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా రావణుడి పాత్ర మీదే చర్చ జరుగుతోంది. ఓ వైపు టాక్సిక్ లాంటి బోల్డ్ మూవీ చేస్తున్న యష్, ప్యారలల్‌గా మైథలాజికల్ కథలో ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 8న రాబోతున్న 4000 కోట్ల భారీ బడ్జెట్ విజువల్ వండర్ ‘రామాయణం’ మీద అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న యష్ ఫస్ట్ లుక్ కొత్త చర్చకు దారి తీసింది. గతంలో వచ్చిన క్లాసిక్స్ అన్నింటిలోనూ రావణుడికి మీసాలే కానీ, గుబురు గెడ్డం ఎక్కడా కనిపించదు. కానీ యష్ మాత్రం ఈ సినిమాలో ఏకంగా భారీ గెడ్డంతో కనిపిస్తున్నారు. నిజానికి ఆదిపురుష్ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గెడ్డంతో కనిపించటం మీద ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరిగింది. మరి ఇప్పుడు ఆ నెగటివిటీని యష్ ఎలా దాటుతారన్నది ఆసక్తికరంగా మారింది. దర్శకుడు నితేశ్ తివారి మొదట రావణుడికి గెడ్డం లేకుండానే లుక్ ప్లాన్ చేశారట. కానీ యష్ ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ కూడా పారలల్‌గా చేస్తుండటంతో గెడ్డం తీసే పరిస్థితి లేకపోయింది. అందుకే గుబురు గెడ్డంతోనే రావణుడిగా యష్ కంటిన్యూ అయ్యారు. జూలై 24న గ్లోబల్ రేంజ్‌లో రాబోతున్న ట్రైలర్‌లో యష్ విజువల్స్ మీద మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అయితే ఓ వైపు టాక్సిక్ లాంటి బోల్డ్ మూవీలో నటిస్తూనే.. మరో వైపు రామాయణలాంటి మైథలాజికల్ మూవీలో నటించారు యష్. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా ప్యారలల్‌గా జరుగుతుండటంతో టాక్సిక్, ఎఫెక్ట్ రామాయణ మీద పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న యష్.. నెగటివ్ క్యారెక్టర్ చేయడమే పెద్ద రిస్క్, అలాంటిది రామాయణ పార్ట్‌లో యష్ రావణుడిగా రాముడి చేతిలో చనిపోయే సీన్‌లో నటించాల్సి ఉంటుంది. టెక్నికల్‌గా విజువల్‌గా ఆ సీన్‌ను ఎంత గొప్పగా తీసినా.. యష్ అభిమానులు ఆ సీన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న టెన్షన్ మేకర్స్‌లో ఇప్పటినుంచో కనిపిస్తోంది. ఇలాంటి ఎన్నో డౌట్స్‌కు ఆన్సర్స్ రావాలంటే అఫీషియల్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్.. 40% షూట్ పూర్తి, రిలీజ్‌పై క్లారిటీ!
వంద కోట్ల హీరోలు.. కానీ ఇంకా టైర్-1 కాదు! ఈ సినిమాలే వారి కెరీర్‌ను మార్చేస్తాయా?
Ram Charan: చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రష్మిక, కియారా, రుక్మిణి మధ్య హాట్ రేస్!
టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?
షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే