Paraak Movie: KGFతర్వాత మరో సంచలనం..! ‘పరాక్’ టీజర్‌తో పాన్ ఇండియా హైప్.. శ్రీమురళి యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా

Paraak Movie: పాన్ ఇండియా మార్కెట్‌లో దక్షిణాది సినిమాల దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాది ఒక భారీ యాక్షన్ సినిమా దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య మరో కన్నడ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ‘బఘీరా’ తర్వాత రోరింగ్ స్టార్ శ్రీమురళి నటిస్తున్న కొత్త పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘పరాక్’ ఇప్పటికే టీజర్‌తోనే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ నెల 13న వచ్చిన టీజర్‌లోని హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్, విజువల్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను ‘కేజీఎఫ్’ తర్వాత మరో భారీ యాక్షన్ మూవీగా అభివర్ణిస్తున్నారు. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దేశవ్యాప్తంగా మంచి స్పందన రావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
కన్నడ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీమురళి, యాక్షన్ హీరోగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘ఉగ్రమ్’తో సూపర్ హిట్ కొట్టిన ఆయన ‘ముఫ్తీ’, ‘బఘీరా’ వంటి సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు శ్రీమురళి ‘పరాక్’ కోసం పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఫిజిక్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. రఫ్ లుక్, ఫిట్ ఫిజిక్, దూకుడైన బాడీ లాంగ్వేజ్ ఆయన పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నాయి. ‘పరాక్’ మూవీకి హలేష్ కోగుండి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ హాలీవుడ్‌లోని ‘మ్యాడ్ మ్యాక్స్’ వంటి సినిమాల నుంచి ప్రేరణ పొందినట్లు వెల్లడించిన ఆయన, ఈ సినిమాలో ప్రతి యాక్షన్ సీక్వెన్స్ రియాలిటీగా ఉంటుందని చెప్పారు.
టెక్నికల్ గా కూడా ఈ మూవీ భారీ స్థాయిలో రూపొందుతోంది. సందీప్ వల్లూరి అందించిన సినిమాటోగ్రఫీ, ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ డాక్టర్ కె. రవి వర్మ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్ తో వచ్చిన టీజర్ ను చూసిన ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. బ్రాండ్ స్టూడియోస్ బ్యానర్‌పై అఖిలేష్ కోగుండి, అషిక్ మదల్, దీపక్ అశ్వత్ నారాయణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆనంద్ ఆడియో ఈ సినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం కూడా ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఎంత హైప్ ఏర్పడిందో చెప్పకనే చెబుతోంది. ఇటీవల కాలంలో ఒక కన్నడ చిత్రానికి జరిగిన అతిపెద్ద ఆడియో హక్కుల ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.
ఇప్పటికే ‘పరాక్’ టీజర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. స్టైలిష్ మేకింగ్, భారీ యాక్షన్, బలమైన విజువల్స్, శ్రీమురళి కొత్త అవతార్ కలిసి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 2026 ఆగస్టు 21 న థియేటర్లలో విడుదల కానుంది. ‘ఉగ్రమ్’, ‘కేజీఎఫ్’ తర్వాత మరోసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ యాక్షన్ బ్లాక్ బస్టర్ వస్తుందనే అంచనాలు ఇప్పటికైతే బలంగా వినబడుతున్నాయి.