July 21, 2026

గయానా తీరంలో బోటు ప్రమాదం 60 మంది గల్లంతు

గయానా తీరంలో బోటు ప్రమాదం 60 మంది గల్లంతు
Reading Time: < 1 minute

గయానా తీరంలో బోటు ప్రమాదం 60 మంది గల్లంతు

Caption of Image.

జార్జ్‌‌టౌన్: గయానా దేశంలో ఘోర ప్రమాదం సంభవించింది. 116 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఒక పెద్ద ప్రయాణికుల పడవ (ఫెర్రీ) సముద్రంలో మునిగిపోయింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 53 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 

మిగతావాళ్ల కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఎమ్వీ బారిమా’ అనే పెద్ద పడవ శనివారం మధ్యాహ్నం గయానా రాజధాని జార్జ్‌‌టౌన్ నుంచి పోర్ట్ కైతుమాకు బయలుదేరింది. 

రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘ఐరన్ పంట్’ అనే చోట మునిగిపోయింది. ప్రమాదానికి గురయ్యే ముందు సాయం కోరుతూ పడవ సిబ్బంది సిగ్నల్స్ పంపారు. అలర్ట్ అయిన కోస్ట్‌‌గార్డ్ సిబ్బంది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేపట్టారు.
 

©️ VIL Media Pvt Ltd.