July 22, 2026

రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం.. అయినా వదలని పోలీసులు

రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం.. అయినా వదలని పోలీసులు
Reading Time: < 1 minute

రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం.. అయినా వదలని పోలీసులు

Caption of Image.

ఢిల్లీ: లోక్ సభా ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి ముక్కు నుంచి రక్తం రావడం కాంగ్రెస్ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది.

ఈ ధర్నా నుంచి పోలీసులు బలవంతంగా రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గాయమైంది. ముక్కు నుంచి రక్తం కారింది. వీడియోల్లో, ఫొటోల్లో ఆయన ముక్కు వెంట రక్తం స్పష్టంగా కనిపించింది. రాహుల్ గాంధీపై పోలీసుల దాష్టీకంపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్త స్రావం వచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా బలవంతంగా చేతులు, కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఈ క్రమంలో.. ఆయన కంటి కింద, చేతిపై గాయాలయ్యాయి.

అరెస్ట్ తర్వాత రాహుల్ గాంధీతో పాటు ధర్నాలో భాగమైన అందరినీ ఛత్రసాల్​స్టేడియంకు పోలీసులు తీసుకెళ్లారు. కనీసం డాక్టర్ను కూడా పిలువకుండా చోద్యం చూశారు. రాహుల్​వ్యక్తిగత భద్రతా సిబ్బంది చికిత్స అందించారు.

©️ VIL Media Pvt Ltd.