సీఎం విజయ్పై బెదిరింపు వ్యాఖ్యలు డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్Caption of Image.
చెన్నై: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్పై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే జి.ఆర్. మార్కండేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్ కావడంతో డీఎంకే కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం తూత్తుకుడి ఎస్పీ ఆఫీసులో పోలీసులు మార్కండేయన్‌ను విచారిస్తున్నారు. జులై 18న జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మార్కండేయన్.. సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించడంతో ఈ వివాదం మొదలైంది.