July 20, 2026

జ్యోతిష్యం: వారాహి ఉత్సవాలు.. ఏ రాశి వారు ఏమంత్రం చదవాలి.. ఏ వస్తువులు దానం చేయాలి..

జ్యోతిష్యం:  వారాహి ఉత్సవాలు.. ఏ రాశి వారు ఏమంత్రం చదవాలి.. ఏ వస్తువులు  దానం చేయాలి..
Reading Time: 3 minutes

జ్యోతిష్యం: వారాహి ఉత్సవాలు.. ఏ రాశి వారు ఏమంత్రం చదవాలి.. ఏ వస్తువులు దానం చేయాలి..

Caption of Image.

హిందూ ఆచారాలప్రకారం వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.  ఈ నెల  23 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. పురాణాల ప్రకారం  శరన్నవరాత్రులు, చైత్ర నవరాత్రులలాగే ఈ ఆషాఢ నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంది జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు తొలగడానికి ఈ  సమయంలో ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రాన్ని.. కొన్ని రకాల వస్తువులను దానం చేయాలని పండితులు చెబుతున్నారు.  ఏ రాశి వారు ఏమంత్రం చదవాలి.. ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

వారాహి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 23 వరకు కొనసాగుతాయి. లలితా త్రిపుర సుందరి దేవి సేనాధిపతి అయిన శ్రీ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. జీవితంలో అష్ట కష్టాలు పడే వారు.. ప్రతి పనిలో ఇబ్బంది పడేవారు.. జాతకంలో దోషాలు ఉన్నవారు  వారాహి నవరాత్రి ఉత్సవాల సమయంలో కనీసం ఒక్క రోజు నియమ నిష్ఠలతో ఉండి.. కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

మేషరాశి :  అమ్మవారికి ఎర్రటి పువ్వులను సమర్పించి, భక్తిశ్రద్ధలతో ఓం క్రీం కాళికాయ నమః” మంత్రాన్ని జపించాలి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.
పరిహారం:  గోధుమలు.. బియ్యం, ఆవు నెయ్యి దానం, గోమాతకు తోటకూరను ఆహారంగా ఇవ్వాలి. 

వృషభరాశి: . అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించి.. ఓం హ్రీం ఛిన్నమస్తాయ నమః  అనే మంత్రాన్ని జపిస్తూ,  కోరికలు నెరవేరాలని ప్రార్థించాలి.
పరిహారం:  వస్త్రాలు, ధనం, బియ్యం, కూరగాయలు దానం

మిథునరాశి: ఈ రాశి వారు ఓం ధుం ధుమావత్యై స్వాహా‘ అనే మంత్రాన్ని జపించాలి.  అమ్మవారికి ఎర్ర కండువాను సమర్పించాలి. దీనివల్ల జీవితంలోని ఆటంకాలు తగ్గుతాయట.
పరిహారం : అమ్మవారికి కుంకుమార్చన, బ్రాహ్మణులకు వస్త్రదానం, దక్షిణతో స్వయంపాకం

కర్కాటక రాశి: చంద్రుడి ప్రభావం ఉన్న ఈ రాశివారు “ఓం శ్రీం కమలాయై నమః” అనే మంత్రాన్ని జపించాలి.  అమ్మవారికి ఎండు ఫలాలు, పటిక బెల్లం , తామర గింజల పాయసాన్ని సమర్పించాలి. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి.
 పరిహారం: బియ్యం, పాలు,  తెలుపు రంగు వస్తువులు దానం 

సింహరాశి: సూర్యుని అనుగ్రహం కోసం వారాహి నవరాత్రి ఉత్సవాల్లో ఈ రాశి వారు  ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపురసుందరే నమః” అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. . అమ్మవారికి కుంకుమ మరియు కండువా సమర్పించడం వల్ల  ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
పరిహారం:  గోధుమలు, రాగి పాత్రలు , ఎరుపు, నారింజ రంగు వస్త్రాలను దానం

 కన్యారాశి: బుధుడి ఆధిపత్యం ఉన్న ఈ రాశి  వారు అమ్మవారికి ఆకుపచ్చ చీర లేదా రవికను సమర్పించి, ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ అనే మంత్రాన్ని జపించాలి. దీనివలన  అదృష్టాన్ని , విజయం వరిస్తాయని పండితులు చెబుతున్నారు. 
పరిహారం:   పచ్చని వస్త్రాలు, ఆకుకూరలు పుస్తకాలను దానం చేయడం శ్రేయస్కరం

 తులారాశి: శుక్రుడి అనుగ్రహం కోసం ఈ రాశి వారు అమ్మవారికి తీపి పదార్థాలు సమర్పించి ‘ఓం హ్రీం భువనేశ్వర్యై నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఇది మానసిక శాంతిని, సమతుల్యతను కాపాడుతుంది.
పరిహారం: పాలు, పెరుగు,  సుగంధ ద్రవ్యాలు (మంగళద్రవ్యాలు) దానం చేయాలి.

 వృశ్చికరాశి: కుజుడి ఆధిపత్యం ఉన్న ఈ రాశి వారు  ఎండు ఫలాలు, కొబ్బరికాయతో నింపిన ఎర్ర రవిక గుడ్డను అమ్మవారికి సమర్పించాలి. ఓం హ్రీం భైరవ్యై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ధైర్యం, బలం పెరుగుతాయి.
పరిహారం: ఎరుపు రంగు వస్త్రాలు, కాయగూరలు  పప్పు ధాన్యాలు దానం చేయడం మంచిది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు అమ్మవారికి పసుపు పువ్వులు , శనగపిండి లడ్డూలను సమర్పించాలి. “ఓం హ్రీం శ్రీం మాతాంగ్యే నమః” అనే మంత్రాన్ని జపించడం అదృష్టాన్ని తెస్తుంది.
పరిహారం:  బియ్యం, పాలు, పంచదార,  పసుపురంగు వస్త్రాలు దానం 

మకరరాశి :  మకర రాశి వారు ఓం హ్రీం బగలాముఖ్యై నమః అనే మంత్రాన్ని జపించి, అమ్మవారికి సుగంధ పుష్పాలు , గాజులను సమర్పించాలి, ఇది శత్రు అడ్డంకిని శాంతింపజేస్తుంది.
పరిహారం: ముత్తైదువుకు అలంకరణ సామాగ్రి, అన్నదానం, పేదలకు వస్త్రదానం 

కుంభరాశి: శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ రాశివారు దుర్గా చాలీసా పఠించి, తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది సానుకూల శక్తిని నిలుపుకోవడానికి సహాయపడుతుందట.
పరిహారం: నల్ల నువ్వులు, నూనె, , ఇనుప వస్తువులు దానం 

 మీనరాశి: గురువు ఆధిపత్యం ఉన్న ఈ రాశి వారు  దీపాన్ని వెలిగించి దుర్గాదేవి మంత్రాలను జపించాలి. దేవతకు పసుపు ముద్దను సమర్పించి, సంపద , శ్రేయస్సు వృద్ధి కోసం దానిని తరువాతి కాలం కోసం భద్రంగా ఉంచుకుంటే  విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 
పరిహారం:  పసుపు రంగు వస్త్రాలు, పసుపు,  కందిపప్పు దానం చేయడం 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.