July 21, 2026

జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్…సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ… కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్...సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ... కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
Reading Time: < 1 minute

జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్…సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ… కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

Caption of Image.

జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్…సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ… కాక్ రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ నీట్ పేపర్ లీక్ కు నిరసనగా సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ( జులై 20 ) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి భారీగా యువత చేరుకున్నారు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న క్రమంలో ఉత్కంఠ నెలకొంది. చలో పార్లమెంట్ మార్చ్ కు బయలుదేరిన సీజేపీ కార్యకర్తలు, యువతను అడ్డుకున్నారు పోలీసులు. కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడంతో జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీకి అనుమతి లేదంటూ సీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు.
 
సీజేపీ చలో పార్లమెంట్ పిలుపుతో అలర్ట్ అయిన పోలీసులు ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. జంతర్ మంతర్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఇదిలా ఉండగా… ఇవాళ ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు మొత్తం 25 రోజులపాటు జరగనున్నాయి.

ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు అయోధ్య చోరీ ఘటన, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, పెట్రోల్ ధరల పెరుగుదల, ఈ20 (ఇథనాల్), రైతులు, మణిపూర్, వెస్ఏసియా సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.

©️ VIL Media Pvt Ltd.