July 20, 2026

OTT Movie Review: సొంతింటి కల కోసం పోరాటం.. ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా చూడొచ్చా?

OTT Movie Review: సొంతింటి కల కోసం పోరాటం.. ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా చూడొచ్చా?
Reading Time: 2 minutes

OTT Movie Review: సొంతింటి కల కోసం పోరాటం.. ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా చూడొచ్చా?

Caption of Image.

డిజిటల్ స్క్రీన్‌పై ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన సరికొత్త కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. అదే కోవలో, మన కలల కోసం.. మనల్ని నమ్ముకున్న కుటుంబం ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది అనే హార్ట్ టచింగ్ పాయింట్‌తో రూపొందిన చిత్రమే “మధురాపురి సదన”. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win) లో స్ట్రీమింగ్ అవుతూ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా విశేషంగా అలరిస్తోంది.

రాజ్ గోపాల్ దేవర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనివాస్ భోగిరెడ్డి, భరత్ సాయినాథ్ రెడ్డి, యషు మాశెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ మధ్యతరగతి కుటుంబ ప్రయాణం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కథేంటంటే:

హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగి వాసు (శ్రీనివాస్ భోగిరెడ్డి) పదవీ విరమణకు దగ్గర్లో ఉంటాడు. కూతురు అమెరికాలో స్థిరపడుతుంది. కొడుకు కృష్ణ (భరత్ సాయినాథ్ రెడ్డి) కూడా విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం సాధించాలని ఆయన కల. కానీ కృష్ణ మాత్రం దర్శకుడిగా తన కలలను నిజం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ తరం– మునుపటి తరం ఆలోచనల మధ్య తలెత్తే సంఘర్షణతో తండ్రి– కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది.

ALSO READ : Weekend Thrillers: ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు.. 

మరోవైపు, భార్య పద్మ జీవితాంతం సొంతింట్లోనే ఉండాలనే కలతో రోజులు లెక్కపెడుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో కల.. ఒక్కో ఆశయం. కూతురు పంపిన డబ్బుతో సొంతింటి నిర్మాణం మొదలవుతుంది. కానీ ఊహించని ఆర్థిక సమస్యలు కుటుంబాన్ని చుట్టుముడతాయి. సొంతింటి కల నెరవేరుతుందా? తండ్రి ఆశ గెలుస్తుందా? లేక కొడుకు కల సాకారమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ…..

విశ్లేషణ:

ఈ తరం పిల్లల ఆలోచనలకు.. మునుపటి తరం తల్లిదండ్రుల ఆశయాలకు మధ్య జరిగే భావోద్వేగ పోరాటమే ఈ సినిమాకు ప్రధాన బలం. డైరెక్టర్ రాజ్ గోపాల్ దేవర ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్‌గా అనిపించినప్పటికీ, దాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించిన విధానం హృదయాలను హత్తుకుంటుంది. ఒక మధ్యతరగతి తండ్రి తన కొడుకు భవిష్యత్తు గురించి పడే ఆరాటం, జీవితాంతం కష్టపడి ఒక సొంతిల్లు కట్టుకోవాలనే తల్లి కల.. ఇవన్నీ ప్రతి సామాన్య కుటుంబానికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

తండ్రి వాసు పాత్రలో శ్రీనివాస్ భోగిరెడ్డి ఒదిగిపోయారు. ఒక వైపు రిటైర్మెంట్ టెన్షన్, మరోవైపు కొడుకు కెరీర్ భయం, ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు.. ఇలా ఒక మిడిల్ క్లాస్ తండ్రి అనుభవించే వేదనను ఆయన అద్భుతంగా పండించారు. డైరెక్టర్ కావాలనుకునే కొడుకుగా భరత్ సాయినాథ్ రెడ్డి, యషు మాశెట్టి తమ పరిధి మేర చక్కగా నటించారు.

టెక్నికల్ వాల్యూస్:

సినిమా బడ్జెట్ పరిమితులు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ.. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. 

©️ VIL Media Pvt Ltd.