July 19, 2026

ఆదిలాబాద్ పట్టణంలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

ఆదిలాబాద్ పట్టణంలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
Reading Time: < 1 minute

ఆదిలాబాద్ పట్టణంలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

Caption of Image.

ఆదిలాబాద్​టౌన్/జగిత్యాల టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ పట్టణంలో శనివారం ఇస్కాన్​ ఆధ్వర్యంలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. స్థానిక వినాయక్​చౌక్‌‌‌‌లోని శ్రీ గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన శోభయాత్ర పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ రథయాత్రకు ఆదిలాబాద్​పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఎస్పీ అఖిల్​మహాజన్​, ఎమ్మెల్యే పాయల్​శంకర్, మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ బండారి అనూష పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

©️ VIL Media Pvt Ltd.