July 21, 2026

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!

Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
Reading Time: < 1 minute
Uday Krishna Reddy Suicide Attempt False Police Medical Report

Uday Krishna Reddy: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడన్న ఘటనలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పోలీస్ వర్గాల వెల్లడించాయి. మద్యం అతిగా సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపాయి. వైద్య పరీక్షల నివేదికల్లో విషపూరిత ద్రవపదార్థాల ఆధారాలు లేవని, కేవలం సింపతీ కోసమే ఆత్మహత్యాయత్నంగా తప్పుడు ప్రచారం చేసినట్లు అనుమానం వ్యక్తం చేశాయి. సూసైడ్ నోట్‌పై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రైనీ IPS, 30 ఏళ్ల వివాహిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రైనీ IPS కి అసభ్యకర మెసేజ్‌లు పంపడమే కాకుండా.. ఆమె గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులమడం, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేశాడని కూడా ఆ ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా నాటకం ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆయన హెల్త్ రిపోర్ట్ ఆధారంగా పోలీస్ వర్గాల వెల్లడించాయి. మద్యం అతిగా సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపాయి. దీంతో ఆయన కేవలం సింపతీ కోసమే ఈ నాటకం ఆడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.