July 21, 2026

స్నేహితులందరికీ కల్ట్‌‌‌‌ దోస్తీ పాట అంకితం 

స్నేహితులందరికీ కల్ట్‌‌‌‌ దోస్తీ పాట అంకితం 
Reading Time: < 1 minute

స్నేహితులందరికీ కల్ట్‌‌‌‌ దోస్తీ పాట అంకితం 

Caption of Image.

హీరో విశ్వక్ సేన్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘కల్ట్‌‌‌‌’. తారక్ సినిమాస్ బ్యానర్‌‌‌‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతదేశపు తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌‌‌‌ ఇది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్‌‌‌‌ రాస్తున్నాడు.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘హీ ఈజ్‌‌‌‌ మై దోస్తీ’ అనే పాటను విడుదల చేశారు. సాంగ్‌‌‌‌ రిలీజ్ ఈవెంట్‌‌‌‌లో విశ్వక్‌‌‌‌ సేన్‌‌‌‌ మాట్లాడుతూ ‘ఆరు నెలలు కష్టపడి యూనివర్సల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ సాంగ్‌‌‌‌గా దీన్ని రెడీ చేశాం. సినిమా కంటే ఎక్కువగా ఈ పాట గుర్తుండిపోవాలని, స్నేహితులందరికీ దీన్ని  అంకితం చేయాలని ఈ  పాటను తీర్చిదిద్దాం. 

జీవితంలో ముగ్గురు మంచి స్నేహతులు ఉంటే చాలు, పదిమంది అక్కర్లేదు. అన్‌‌‌‌కండిషనల్‌‌‌‌గా మిమ్మల్ని ఇష్టపడే స్నేహితుడిని మర్చిపోవద్దు. రాబోయే ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ డేకు అందరికీ ఈ పాటను గిఫ్ట్‌‌‌‌గా ఇస్తున్నా. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ రిలీజ్ తర్వాతే ఈ చిత్రం విడుదల కానుంది’ అని చెప్పాడు. 

నటులు కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, ఈజీ తదితరులు పాల్గొన్నారు.  గోవా ట్రిప్‌‌‌‌ నేపథ్యంలో సాగిన ఈ ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రవి బస్రూర్ కంపోజ్ చేయగా, కార్తీక్ పాడాడు.  సంతోష్ వెంకీ సాహిత్యం అందించాడు. 

©️ VIL Media Pvt Ltd.