July 21, 2026

వరుణ్ తేజ్‌కు ఈసారి హిట్ గ్యారెంటీనా?.. ‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘రాస గుమ్మడి’ మాస్ సాంగ్ రిలీజ్!

వరుణ్ తేజ్‌కు ఈసారి హిట్ గ్యారెంటీనా?.. 'కొరియన్ కనకరాజు' నుంచి 'రాస గుమ్మడి' మాస్ సాంగ్ రిలీజ్!
Reading Time: < 1 minute

వరుణ్ తేజ్‌కు ఈసారి హిట్ గ్యారెంటీనా?.. ‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘రాస గుమ్మడి’ మాస్ సాంగ్ రిలీజ్!

Caption of Image.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో రూటు మార్చారు. ‘ముకుంద’, ‘కంచె’,  ‘ఫిదా’ వంటి విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వచ్చిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే పట్టుదలతో ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా.. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన రెండో సింగిల్ ‘రాస గుమ్మడి’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఈ పాటను పూర్తి తెలంగాణ జానపద శైలిలో మాస్ బీట్‌తో కంపోజ్ చేశారు .  నల్గొండ గద్దర్ ఎనర్జిటిక్ వాయిస్, కాసర్ల శ్యామ్ అందించిన చురుకైన సాహిత్యం పాటకు అసలైన జాతర వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

ఈ పాటలో వరుణ్ తేజ్ ట్రెడిషనల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా, మాస్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. మరోవైపు స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించిన దక్ష నాగర్కర్ తన గ్లామర్, డ్యాన్స్‌తో పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ, రంగురంగుల కార్నివల్ సెట్స్, ఫోక్ బీట్ కలసి ‘రాస గుమ్మడి’ని పక్కా మాస్ సెలబ్రేషన్ సాంగ్‌గా మార్చేశాయి.

ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక వినోదాత్మక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న  ఈ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా లేదా అన్నది ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

 

©️ VIL Media Pvt Ltd.