సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమావేశాలు

గ్రేటర్ వరంగల్/ మధిర/ ములకలపల్లి, వెలుగు: సర్ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సమావేశాలు నిర్వహించారు. సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల మీటింగ్ నిర్వహించగా, వరంగల్పార్లమెంట్ ఇన్చార్జి నాసీర్అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని డీసీసీ ప్రెసిండెంట్ వెంకట్రామ్ రెడ్డి, జిలా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ తో కలిసి మాట్లాడారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను స్పీడప్గా చేయాలన్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కాంగ్రెస్పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్ఐఆర్ ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొని ఇన్చార్జిలు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ నల్లపు దుర్గాప్రసాద్, అశ్వారావుపేట నియోజవర్గ కోఆర్డినేటర్ తుమ్మ రాంబాబు, ములకలపల్లి కోఆర్డినేటర్
రాజేశ్పరిశీలించారు.