July 21, 2026

కార్గో షిప్‎పై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి.. ఒకరికి సీరియస్

కార్గో షిప్‎పై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి.. ఒకరికి సీరియస్
Reading Time: < 1 minute

కార్గో షిప్‎పై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి.. ఒకరికి సీరియస్

Caption of Image.

న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడుల తీవ్రత పెరిగింది. తాజాగా, ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు నుంచి భారతీయ నావికులతో బయలుదేరిన వాణిజ్య నౌకపై రష్యా మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో మొత్తం 10 మరణించగా.. మృతుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు. మరో భారత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని సరికాదని పేర్కొంది. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వివరాల ప్రకారం.. జూలై 19 సాయంత్రం ఉక్రెయిన్‎లోని ఒడెసా పోర్టు నుంచి బయలుదేరిన గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవి గోల్డెన్ లియో నౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో ఐదుగురు భారతీయులతో సహా 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ దాడిలో నలుగురు భారతీయులు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. 

బాధితులకు సాధ్యమైన సహాయ సహకారాలు అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం.. పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడవేయడం.. నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం ఖండించదగినది. ఇలాంటి ఘటనలను నివారించాలి. మరణించిన భారత పౌరుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడిన పౌరుడు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

 

©️ VIL Media Pvt Ltd.