ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. కేరళలో రేపు స్కూళ్లు, కాలేజీలు క్లోజ్!

FIFA World Cup Final Fever: అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ మధ్య జరగబోయే ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup Final) ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రేపు (సోమవారం, జూలై 20) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:30 గంటలకు) ఈ చారిత్రాత్మక ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించాలనుకునే ఫుట్‌బాల్ ఫ్యాన్స్, విద్యార్థుల అభ్యర్థనతో ముఖ్యమంత్రి వీడి సతీశన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఇప్పుడు హ్యాపీయేనా బ్రో?.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్:
సెలవు ప్రకటనను విద్యాశాఖ మంత్రి ఎన్. శంషుద్దీన్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. ఇప్పుడు హ్యాపీయేనా పిల్లలూ? (Happy now, children?) అంటూ సరదాగా పోస్ట్ పెట్టారు. అర్ధరాత్రి మ్యాచ్ కావడంతో విద్యార్థులు నిద్రలేమికి గురవుతారని, ఉదయాన్నే స్కూళ్లకు చేరుకోవడం కష్టమవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఉన్నత విద్యాశాఖ మంత్రి రోజీ ఎమ్. జాన్ కూడా కాలేజీలకి హాలీడే ప్రకటించారు.. స్టూడెంట్స్ ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు పడకుండా ఈ మెగా ఫైనల్‌ను ఎంజాయ్ చేయాలని సూచించారు. అయితే, ఇప్పటికే ఖరారైన పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, అవి యధావిధిగా జరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) స్పష్టం చేసింది.
ALSO READ : రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌పై బిగ్ డిస్కషన్..
కేరళలో ఫుట్‌బాల్ జాతర.. పొలిటికల్ లీడర్స్ సపోర్ట్:
ఈ విద్యా సంస్థల సెలవు నిర్ణయానికి ముందే రాష్ట్రంలో రాజకీయంగా సపోర్ట్ లభించింది. మాజీ విద్యాశాఖ మంత్రి, సీపీఐ(ఎం) నాయకుడు వీ శివన్‌కుట్టి సోమవారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలని, ఆ నష్టపోయిన పని దినాన్ని భర్తీ చేయడానికి రాబోయే ఏదైనా శనివారాన్ని వర్కింగ్ డేగా మార్చవచ్చని ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్ష యూడీఎఫ్ నాయకులు కూడా ఇలాంటి డిమాండ్లే చేశారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్, ముఖ్యంగా అర్జెంటీనా జట్టుకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో, రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు.
Monday Holiday Declared For Entire Kerala Schools Due To Late Night World Cup Final 🏆🏆 #Worldcup2026 #ARGESP pic.twitter.com/d9GOgXwKvu
— Jaseel Muhammed (@JaseelMhd_GOAT) July 19, 2026