ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిస్తుంది.
కర్నాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, ట్రైనీ IPS ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధించడమే కాకుండా, గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా బాధితురాలి ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఉదయ్‌పై BNSలోని పలు తీవ్ర సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 8 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.
అంతకుముందు ఆరోపణలపై స్పందించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్!
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నా టకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, ట్రైనీ IPS ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధించడమే కాకుండా, గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా, బాధితురాలి ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి ఆమె భర్తకు పంపి తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఉదయ్‌పై BNSలోని పలు తీవ్ర సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.